Aamir Khan and Kiran Rao Divorce: విడాకులు తీసుకుంటున్నామని తెలిపిన బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ దంపతులు, 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు సంయుక్త ప్రకటన

Aamir Khan and Kiran Rao (Image source: Instagram)

తామిద్దరం వివాహ బంధానికి స్వస్థి చెప్పి విడాకులు తీసుకుంటున్నట్టు బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ దంపతులు సంయుక్త‌ ప్ర‌క‌ట‌న చేశారు. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ వైవాహిక బంధంలోని ఎన్నో తీపి జ్ఞాప‌కాలు, చిరున‌వ్వులు, హాయిగా గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌పై తాము త‌మ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ, త‌మ కుమారుడి బాధ్య‌త‌ను ఇద్ద‌రం తీసుకుంటామ‌ని తెలిపారు. సినిమాలు, పానీ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో క‌లిసే ప‌నిచేస్తామ‌ని చెప్పారు. తాము విడిపోవాల‌ని కొంత కాలం క్రితమే నిర్ణ‌యం తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామ‌ని వివ‌రించారు. కాగా, ఆమిర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు తీసుకున్నారు. అనంత‌రం కిర‌ణ్ రావ్‌ను 2005లో ఆమిర్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతోనూ విడిపోతున్నాడు.

ఆమిర్ ఖాన్ దంప‌తులు ప్ర‌క‌ట‌న‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement