Prabhas Wishes to Rajamouli: థాంక్స్ డార్లింగ్ అంటూ ప్రభాస్‌కి రాజమౌళి సమాధానం, నాకంటే ముందు నన్ను నమ్మిన వ్యక్తి నువ్వే అంటూ రిప్లై, ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే..

SS Rajamouli (Photo Credits: Twitter)

దర్శకుడు రాజమౌళి ఇటీవల ఆయన రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అయిన సంగతి విదితమే. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు రన్నర్‌గా నిలిచారు. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎమ్‌ఎమ్‌ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వీరికి శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్‌తో పాటు లాస్ ఏంజెల్స్‌ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెల్స్‌ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. ఇక ప్రభాస్ పోస్ట్‌పై రాజమౌళి స్పందించారు. ‘‘థాంక్స్ డార్లింగ్. నేను ఇంత పేరు(ప్రపంచ స్థాయి గుర్తింపు) తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వే’’ అంటూ సమాధానం ఇచ్చారు.

Here's Prabhas Tweet

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement