Pradeep K Vijayan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమిళ నటుడు ప్రదీప్ విజయన్, గుండెపోటుకు గురయ్యాడని వార్తలు
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతడి స్నేహితుడు ఫోన్ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతడి స్నేహితుడు ఫోన్ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. గుండెపోటు వల్లే నటుడు మరణించాడని భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీడియా మొగుల్ అస్తమయం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు ఇకలేరు
కాగా ప్రదీప్.. తెగిడి అనే సినిమాతో పాపులర్ అయ్యారు. విలన్‌గా, కమెడియన్‌గా పలు సినిమాలు చేశారు. టెడ్డీ, ఇరుంబు తిరై, తమిళుకు ఎన్ ఒండ్రై అళతువం, లిఫ్ట్, మనం, కెన్నడీ క్లబ్, ఆడై.. ఇలా అనేక తమిళ చిత్రాల్లో నటించారు. చివరగా రాఘవ లారెన్స్ ‘రుద్రన్’ సినిమాలో కనిపించారు.
Here’s News