Sayaji Shinde Health Update: నిలకడగా సాయాజి షిండే ఆరోగ్యం, ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆంజియోప్లాస్టీ సర్జరీ చేసిన వైద్యులు, రెండు రోజుల్లో డిశ్చార్జ్

నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్‌ మాట్లాడుతూ.. 'సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.

Sayaji shinde (photo/Insta)

ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్‌ మాట్లాడుతూ.. 'సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ చేయాల్సిందేనని చెప్పాం. దీంతో తన షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. రెండురోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తాం' అని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)