Mokksha Sengupta's Dance Video: వీడియో ఇదిగో, కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ వేసింది. దారుణ ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ వేసింది. దారుణ ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. కొద్దిరోజుల క్రితం ఈ ప్రదర్శన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియో ఇదిగో, హిందీ పాటకు రీల్స్ చేస్తూ ఒక్కసారిగా లోయలో పడిన మహిళ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..
బెంగాల్ ఘటన (Kolkata Doctor Rape and Murder)పై మోక్ష(Mokksha Sengupta) ఇదివరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..‘‘ ఆ నేరం జరిగిన సమయంలో సినిమా విడుదల నిమిత్తం నేను హైదరాబాద్‌లో ఉన్నాను. దాని గురించి తెలియగానే మా సొంతూరుకు తిరిగివచ్చి, నిరసనల్లో భాగమయ్యాను. ఈ కళ ద్వారా సామాన్యుల సమస్యలను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అని అన్నారు. మోక్ష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘నీతోనే నేను’, ‘అలనాటి రామచంద్రుడు’, ‘ఐ హేట్ యూ’ వంటి చిత్రాలలో నటించింది. త్వరలోనే ధన్‌రాజ్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామం రాఘవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)