Bhagavanth Kesari Update: భగవంత్ కేసరి నుంచి లేటెస్ట్ వీడియో ఇదిగో, తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ దుమ్మురేపిన టాలీవుడ్ హీరో నందమూరి బాల‌కృష్ణ

Anil Ravipudi, Balakrishna Bhagavanth Kesari, Balakrishna, Bhagavanth Kesari, Bhagavanth Kesari shooting update, Bhagavanth Kesari shooting, Bhagavanth Kesari shooting update video, నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి ,భగవంత్ కేసరి వీడియో, భగవంత్ కేసరి లేటెస్ట్ వీడియో, భగవంత్ కేసరి తాజా వీడియో

Bhagavanth Kesari Update (photo-X)

టాలీవుడ్ హీరో నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న క్రేజీయెస్ట్‌ ప్రాజెక్ట్‌ భగవంత్ కేసరి గురించి తాజా అప్ డేట్ వచ్చింది. మీకు ఓ ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ వీడియో అందించబోతున్నామని అనిల్ రావిపూడి ట్వీట్ ఇంతకుముందు ట్వీట్ చేయగా తాజాగా వీడియోను విడుదల చేశారు.

డిసెంబర్ 8, 2022న భగవంత్‌ కేసరి చిరస్మరణీయ షూటింగ్‌ జర్నీని ప్రారంభించి.. కష్టతరమైన, సంతోషకరమైన 8 నెలల షూటింగ్‌ తర్వాత పూర్తి చేశాం. సెట్స్‌లో ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన లెజెండ్ నందమూరి బాలకృష్ణకు, నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు.ఈ దసరా మనందరికీ విశేషమైంది కాబోతుందని ఖచ్చితంగా అనుకుంటున్నా. అక్టోబర్ 19, థియేటర్లలో కలుద్దాం.. అంటూ అనిల్ రావిపూడి విడుదల చేసిన వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్‌ వీడియోలో భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు బాలకృష్ణ. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఎస్‌ థమన్‌ మరోసారి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తోండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Bhagavanth Kesari Update (photo-X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now