Bheemla Nayak: భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా, విషాద సమయంలో సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని తెలిపిన పవన్ కళ్యాణ్
సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించాడు.
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశాడు. 'మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. దీని వివరాలను చిత్రనిర్మాణ సంస్థ తెలియజేస్తుంది' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)