RIP Bappi Lahiri: బప్పి లహిరి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి, ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారంటూ ట్వీట్

ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

chiranjeevi (photo-IANS)

ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా కోసం అనేక చార్ట్‌బస్టర్‌ సాంగ్‌లను అందించారు, అవి నా చిత్రాల ప్రజాదరణకు ఎంతో దోహదపడింది. ఆయన సంగీతంలో ప్రతిబింబించే తన ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల చూపించే ఉత్సాహంతో ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు’ అంటూ చిరు రాసుకొచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement