Eagle Trailer: విషం మింగుతాను అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ఈగల్ ట్రైలర్, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల
కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్ పోస్టర్లు, స్టైలిష్ లుక్, ట్రైలర్ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈగల్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ రవితేజ మార్క్ డైలాగ్స్ తో సాగుతున్న ట్రైలర్.. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కట్ చేయబడి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రవితేజ లాంగ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తూ.. మరోవైపు మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్ పట్టుకుని ఉన్న కాన్సెప్ట్ పోస్టర్‌తో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాడు.
Here's Trailer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)