Ramoji Rao Passes Away: వీడియో ఇదిగో, రామోజీరావు పార్థీవ దేహాన్ని చూసి కంతతడి పెట్టిన రాజమౌళి
ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు.
ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజమౌళి కంటతడి పెట్టుకోవడం తీవ్రంగా కలిచివేసింది.రామోజీ పార్తీవదేహం పక్కనే ఉన్న శైలజ, కిరణ్‌ను పరామర్శించారు. వారికి గుండెంత ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని పంచే ప్రయత్నం చేశారు. మీడియా మొగుల్ అస్తమయం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు ఇకలేరు
కీరవాణి, రమా రాజమౌళి, రాజమౌళి, ఇతర కుటుంబ సభ్యులు రామోజీకి శ్రద్దాంజలి ఘటించారు.ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గత కొద్దికాలంగా గుండె, ఇతర వృద్దాప్య వ్యాధులతో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బెడ్‌కే పరిమితమయ్యారు. ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో శనివారం ఉదయం 3.45 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)