Guntur Kaaram Oh My Baby Song: ఓమై బేబి లిరికల్ వీడియో సాంగ్ ఇదిగో, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న గుంటూరు కారం
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur kaaram) నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur kaaram) నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఫీల్ అందించేలా సాగుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు పాడింది. గుంటూరు కారంలో పెండ్లి సందడి ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Here's Song