HanuMan Pre-Release Event: హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా చిరంజీవి, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో చిన్నప్పటి పాత్రను పోషించాడు

HanuMan Pre-Release Event (photo-X)

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘జాంబిరెడ్డి’ అనే సినిమా విడుదల అయి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ‘హనుమాన్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. హనుమాన్’ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో హనుమంతుడిని గ్రాఫిక్స్ రూపంలో చూపించబోతున్నట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పారు.ఇక తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ తో సహా 11 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Heres' News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now