Shah Rukh Khan’s Viral Pic: అంబులెన్స్‌లో ముఖం నిండా కవర్‌తో బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్ ఖాన్‌, సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌

ఇందులో షారుక్‌ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది.

Shah Rukh Khan Started To Shoot For Atlee’s Film

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్‌ చేస్తోంది.ముంబైలో షూటింగ్‌లో పాల్గొన్న కింగ్‌ ఖాన్‌ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో షారుక్‌ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది. దీంతో ఇది ఏ మూవీ షూటింగ్‌ అయ్యింటుందని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు.అయితే ఇది డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌ ఖాన్‌ ‘లయన్‌’ మూవీ సెట్‌లోనిది అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఫొటోను అభిమానులు షేర్‌ చేస్తూ అట్లీ, లయన్‌ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. లయన్‌ మూవీలో షారుక్‌ సరసన సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)