Hero Ajith: ఓటు హక్కును వినియోగించుకున్న హీరో అజిత్, షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తమిళ నటుడు, సెల్ఫీ తీస్తున్న అభిమాని నుంచి ఫోన్ లాక్కుని తరువాత క్షమాపణ చెప్పిన అజిత్

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, సీనియర్ హీరో అజిత్ చెన్నైలో తన ఓటు వేశారు. తన అర్ధాంగి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్ల మాదిరే ఆయన క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అజిత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు.

Ajith-THALA

ఓ అభిమాని మరీ ముందుకొచ్చి అజిత్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహించిన అజిత్ ఆ యువకుడి నుంచి ఫోన్ లాక్కొన్నారు. ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపలికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ ను తిరిగి అభిమానికి ఇచ్చేశారు. వెళుతూ వెళుతూ క్షమాపణ కూడా చెప్పారు. దాంతో ఆ అభిమాని ఓకే సార్ అంటూ స్పందించాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement