Ajith Kisses Wife Shalini (Photo-Instagram-Shamlee)

హీరో అజిత్‌-షాలినిల రొమాంటిక్‌ డేట్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్యయంగా ఆ స్టార్‌ హీరో భార్య చెల్లెలు షామ్లి షేర్‌ చేయడంతో బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా సోమవారం వారి 23వ పెళ్లి రోజు సందర్భంగా అజిత్‌, షాలినిలు రొమాంటిక్‌ డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. అక్కడ బ్లూ లైట్‌లో డాన్స్‌ చేస్తూ అజిత్‌ భార్య షాలికి వెనక నుంచి హగ్‌ చేసుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ ఫొటో చూసిన వారి ఫ్యాన్స్‌ మురిసిపోతూ వారికి వెడ్డింగ్‌ యానివర్సరీ విషెస్‌ తెలుపుతున్నారు. తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

పెళ్లైన తర్వాత ఇలా వీరిద్దరూ ఇలా కనిపించడం తొలిసారి. అజిత్‌ హీరోగా ఎంత బిజీ ఉన్న ఫ్యామిలీకి మాత్రం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాడు. స్టార్‌ హీరో అయిన అజిత్‌.. కుటుంబం, వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఇష్టపడడు. పిల్లలు, భార్యతో అజిత్‌ పబ్లిక్‌లోకి రావడం చాలా అరుదు. షాలిని, అజిత్‌లది ప్రేమ పెళ్లి అయినప్పటికీ వీరిద్దరూ ఇలా ఎన్నడూ క్లోజ్‌గా కనిపించింది లేదు. వారి 23 ఏళ్ల వైవాహిక బంధంలో ఈ దంపతులు రొమాంటిక్‌ డేట్‌ రావడం, ఆ ఫొటోలు షేర్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫొటో ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Shamlee (@shamlee_official)

ఇదిలా ఉంటే వారిద్దరూ జంటగా నటించిన ‘అద్భుతం’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం షాలిని సినిమాలకు గుడ్‌బై చెప్పి గృహిణిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది.