Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.

Prabhas (Credits: X)

Hyderabad, Jan 13: బాహుబలి (Bahubali) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని (Karnataka) దక్షిణ కన్నడ జిల్లా కటీలులో కొలువైన దుర్గా పరమేశ్వరి అమ్మవారిని స్టార్ నటుడు ప్రభాస్ శుక్రవారం దర్శించుకున్నారు. మాస్క్ ధరించి వచ్చిన ఆయనను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. సలార్ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూరుతో కటీలు వచ్చిన ఆయన అమ్మవారిని సేవించుకున్నారు. ప్రభాస్‌ కు ఆలయ ప్రతినిధులు అమ్మవారి పటాన్ని బహూకరించారు. ప్రభాస్ వెళ్లిపోయిన తర్వాత ఆలయ అధికారులు.. ప్రభాస్‌ అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ఫొటోను విడుదల చేశారు. అది చూసి అప్పటి వరకు అక్కడే ఉన్నవారు అయ్యో.. ఇప్పటి వరకు తమ పక్కన ఉన్నది ప్రభాసా? అని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Hanuman Team Donation: చెప్పిన‌ట్లుగానే చేసిన హ‌నుమాన్ టీమ్, టికెట్ క‌లెక్ష‌న్ల‌లో అయోధ్య‌కు విరాళంగా ఎంతిచ్చారంటే!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement