
Wanaparthy, March 2: వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి స్వామి శేష వస్త్రాలు సమర్పించి వేద ఆశీర్వచనం చేశారు పండితులు.
అనంతరం వనపర్తి ప్రభుత్వ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy at Wanaparthy). వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్(బాలుర) పాఠశాలకు శంకుస్థాపన చేశారు.
జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, శ్రీ రంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం, రాజానగరం, పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
CM Revanth Reddy Wanaparthy tour updates
వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
సీఎం రేవంత్ రెడ్డికి స్వామి శేష వస్త్రాలు సమర్పించి వేద ఆశీర్వచనం చేసిన పండితులు
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం… pic.twitter.com/FncgpBocv0
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025
సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక బోర్డు వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి , జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు.