Hyderabad, JAN 12: ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా మన పురాణాల్లోని హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్, గెటప్ శీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. నేడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయం సాధించింది. హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని అన్నారు. దీంతో చిత్రయూనిట్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందే దేశమంతటా నిన్న సాయంత్రం నుంచే ఆల్మోస్ట్ 1000 ప్రీమియర్స్ వేయగా దాదాపు అన్ని బుకింగ్స్ అయిపోయాయి. నిన్నే చాలా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం.
Team #HANUMAN contributed ₹14,25,810 to #AyodhyaRamMandir, donating ₹5 from each of the 2.85 lakhs tickets sold during yesterday's premieres. 🔥#HanuManRAMpage #HanumanReview #TejaSajaa #PrashanthVarma #HanuManEverywhere #TeluguInsider pic.twitter.com/oEEcl8yV5X
— Telugu Insider (@telugu_insider) January 12, 2024
దేశమంతటా హనుమాన్ సక్సెస్ వినిపిస్తుండటంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ప్రీమియర్స్ కి చాలా బాగా టికెట్స్ సేల్ అయ్యాయి. దాదాపు 2 లక్షల 85 వేల టికెట్స్ వరకు అమ్ముడుపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని టికెట్స్ నుంచి 5 రూపాయల చొప్పున అంటే ఆల్మోస్ట్ రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి చెక్ రూపంలో అందచేస్తాం అని తెలిపారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు. అలాగే హనుమాన్ సినిమా థియేటర్స్ లో నడిచినన్ని రోజులు ప్రతి టికెట్ పై 5 రూపాయలు అయోధ్యకు ఇస్తామని మరోసారి తెలిపారు.
ఇక హనుమాన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. హనుమాన్ శక్తులు ఒక మనిషికి వస్తే ఏమవుతుంది అనే కథతో తేజ సజ్జని సూపర్ హీరోగా చూపించి, చివర్లో హనుమంతుడిని రప్పించి భారీ హిట్ కొట్టారు. చివరి అరగంట అయితే ప్రేక్షకులు స్క్రీన్ నుంచి తల కూడా తిప్పకుండా చూస్తున్నారు. అందరూ జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ థియేటర్స్ నుంచి ఒక మంచి అనుభూతితో వెళ్తున్నారు.