RRR Janani Song: జననీ.. ప్రియ భారత జననీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఆత్మలాంటి పాటను విడుదల చేసిన టీం, పాట కోసం రెండు నెలలు శ్రమించిన మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి

జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారని పేర్కొన్నారు.

RRR Janani Song (Photo-Video Grab/RRR Twitter)

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్‌ఆర్‌. ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ జూ. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన 'నాటు నాటు', 'దోస్తీ' పాటలు సినీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతాగానో అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి జనని సాంగ్‌ను విడుదల చేశారు. దేశభక్తిని చాటేవిధంగా ఈ పాటను రూపొందించారు.

జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారని పేర్కొన్నారు. డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్‌ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్‌ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్‌ ఎమోషన్‌ కనిపించదు. కానీ సినిమా సోల్‌ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement