NTR's 101st Birth Anniversary: ఎన్టీఆర్‌ 101వ జయంతి, ఘనంగా నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నటులు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, పురందేశ్వరి అంజలి ఘటించారు

Jr NTR and Kalyan Ram (Photo Credits: Instagram)

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నటులు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, పురందేశ్వరి అంజలి ఘటించారు. తన సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చిన ఎన్టీఆర్‌.. నవరస నటసార్వభౌముడికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తాతను స్మరించుకున్నారు. అంతకుముందు మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. అంటూ ఎన్టీఆర్‌ ఎమోషనల్ ట్వీట్‌ చేశారు. ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చిరంజీవి డిమాండ్, ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపిన మెగాస్టార్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now