నేడు ఎన్‌టీఆర్‌ 101వ జయంతి సంద‌ర్భంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు ఆర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్‌టీఆర్‌ను స్మరించుకుంటూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం సముచితమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ.. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చిరు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి-ఎన్‌టీఆర్‌ కాంబోలో వచ్చిన ఏకైక సినిమా 'తిరుగులేని మనిషి'. అప్పట్లో ఘన విజయం సాధించింది. హలీవుడ్‌ ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్‌పై కాల్పులు జరిపిన దుండగులు, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)