Rashid Khan Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ మృతి

సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

ఉస్తాద్ రషీద్ ఖాన్

సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.

జబ్ వి మెట్ అనే బాలీవుడ్ చిత్రంలో ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement