Nana Patekar: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌

ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు.

Nana Patekar Hits a Fan Trying To Click Selfie During Shoot of His Film Journey in Varanasi

ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్‌ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది.

Nana Patekar Hits a Fan Trying To Click Selfie During Shoot of His Film Journey in Varanasi

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)