Project K: మీ కాంప్లిమెంట్స్ తట్టుకోలేనంటూ ప్రభాస్‌పై అమితాబ్ సంచలన ట్వీట్, అమితాబ్ బచ్చన్‌కు విందు భోజనం వడ్డించిన రెబల్ స్టార్, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్లో బిజీ అయిన డార్లింగ్
టీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను
ప్రస్తుతం ప్రభాస్ 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. తనతో కలిసి పనిచేస్తున్న బిగ్‌బీకి ప్రభాస్ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ తెలిపారు.
'టీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను.' అని ట్వీట్ చేశారు అమితాబ్. ప్రభాస్ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్కు కూడా ఇంటిరుచులను రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్‌కు విందు భోజనం వడ్డించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)