RIP Bappi Lahiri: బప్పీ లహరికి బంగారం అంటే ఎందుకు అంత ఇష్టం, ఓ ఇంటర్యూలో సీక్రెట్ బయటపెట్టిన బాలీవుడ్ సంగీత దిగ్గజం

ఓ హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవారు. 'ఓ సాంగ్‌ రికార్డింగ్‌ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది.

Bappi-Lahiri-Passes-Away-

బప్పీ లహరి బంగారం లేకుండా అసలు కనిపించేవారు కాదు. ఆయనకు బంగారం అంటే అంత ఇష్టం మరి. `గోల్డ్ ఈజ్ మై గాడ్‌` అంటూ ఆయన మెడలో ఎప్పుడూ బంగారు ఆభ‌ర‌ణాలు మెరుస్తూ ఉండేవి. దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఓ హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవారు. 'ఓ సాంగ్‌ రికార్డింగ్‌ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా నా భార్య ఓ గణపతి లాకెట్‌ కూడిన బంగారు గొలుసును ఇచ్చింది. నా మెడలోని గణపతి నన్ను ఎప్పుడూ సరక్షితంగా ఉంచుతుంది అని నమ్ముతాను. అంతేకాకుండా నా కెరీర్‌ ఎదుగుతున్న కొద్దీ నా బంగారం మరింత రెట్టింపయ్యింది' అని పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement