Superstar Krishna No More: తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం, సూపర్ స్టార్ మృతిపై సంతాపం తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూపర్ స్టార్ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ..ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి.
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూపర్ స్టార్ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ..ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.తన సినిమాల్లో ప్రయోగాలకు పెద్ద పీట వేసిన శ్రీ కృష్ణ గారు, అనేక నూతన సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేశారు. సగటును ఏడాదికి పది సినిమాల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేయటం వారి నిబద్ధతకు నిదర్శనం. తెలుగు తెరపై వారి స్ఫూర్తి అజరామరం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)