Superstar Krishna No More: కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారని ట్వీట్ చేసిన వర్మ
ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు.
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ఆర్జీవీ ఈ ట్వీట్‌కు జత చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)