SSMB 29 Latest Update: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై పుకార్లను నమ్మవద్దు, సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా తామే ఇస్తామని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని శ్రీ దుర్గ ఆర్ట్స్ తెలిపింది.

SS Rajamouli and Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని శ్రీ దుర్గ ఆర్ట్స్ తెలిపింది. కొన్ని ఇంగ్లీష్  వెబ్ సైట్స్ లో వెలువడిన కథనాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పింది. క్యాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి తమ సినిమాలో భాగమైనట్టు రాశారని... ఇందులో నిజం లేదని తెలిపింది. తమ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా తామే ఇస్తామని... తమ అధికారిక ప్రకటనను తప్ప ఇతర అప్ డేట్స్ ను నమ్మొద్దని సూచించింది.

Here's Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif