Sunny Leone: పాప గురించి పోస్ట్ పెట్టిన సన్నీలియోన్, ఆమె ఆచూకి చెప్పిన వారికి రూ. 50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటన

శృంగార తార సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ బాలిక ఆచూకి తెలిపిన వారికి తను ప్రత్యేకంగా రూ.50 వేల రూపాయలను బహుమతి రూపంలో అందజేస్తానని తెలిపింది. బాలిక ఫోటోతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ వివరాలు అన్నీ షేర్ చేసింది.

Sunny Leone (Photo Credits: Instagram)

శృంగార తార సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ బాలిక ఆచూకి తెలిపిన వారికి తను ప్రత్యేకంగా రూ.50 వేల రూపాయలను బహుమతి రూపంలో అందజేస్తానని తెలిపింది. బాలిక ఫోటోతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ వివరాలు అన్నీ షేర్ చేసింది. న్యూస్ ఏంటంటే.. సన్నీలియోన్ ఇంట్లో గత కొన్ని ఏండ్ల నుంచి ముంబాయి కి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నాడు.

కిరణ్ కి 9 ఏళ్ల అనుష్క కూతురు ఉంది. అయితే తను 8 వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ముంబాయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది.ఈ నేపథ్యంలో బాలిక కోసం తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు. అయిన బాలిక ఆచూకి ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆ బాలిక ఆచూకి తెలియజేసిన వారికి 11 వేల రూపాయిల రివార్డును ఇస్తానని.. తండ్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.సన్నీలియోన్ మాత్రం బాలిక ఆచూకి తెలిపిన వారికి నేను వ్యక్తిగతంగా రూ.50 వేల రూపాయలు ఇస్తానని తన ఇన్ స్టాలో ప్రకటించింది.

Here's Her Post

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement