SuperStar Krishna Health Update: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేసిన వైద్యులు,మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడి
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉంది. సుమారు మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉంది. సుమారు మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఎమర్జెన్సీలో చికిత్స ప్రారంభించాం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. వెంటిలెటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయనకు ఎటువంటి చికిత్స ఇవ్వాలో అదే చేస్తున్నాం. మరో 24 గంటలు ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంది’ అని వైద్యులు చెప్పారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement