Mahesh Babu on Mem Famous Movie: మేమ్ ఫేమస్ సినిమాను ఆకాశానికి ఎత్తేసిన మహేష్ బాబు, మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’థియేటర్ల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోను సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. ‘మేమ్ ఫేమస్ చిత్రం అద్భుతంగా ఉంది.
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’థియేటర్ల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోను సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. ‘మేమ్ ఫేమస్ చిత్రం అద్భుతంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ల పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా సుమంత్ ప్రభాస్ తన మల్టీ టాలెంట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఈ మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నాను’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. తమ సినిమాను మహేశ్‌బాబు ప్రశంసించడం పట్ల మేమ్ ఫేమస్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాతలు మహేశ్‌బాబుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
Mahesh Babu Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)