Actor Arulmani Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

ప్రముఖ తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రజ‌నీకాంత్ నటించిన లింగ‌తో పాటు, సూర్య సింగం, ఇంకా ప‌లు సినిమాల్లో ఆయన కీల‌క పాత్ర‌లు పోషించారు.

Arulmani Dies (phtoto-Instagram)

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రజ‌నీకాంత్ నటించిన లింగ‌తో పాటు, సూర్య సింగం, ఇంకా ప‌లు సినిమాల్లో ఆయన కీల‌క పాత్ర‌లు పోషించారు. సింగం 2 సినిమాల్లో విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా అరుళ్మణి నటించి మెప్పించారు. అయితే రాజకీయాల్లో చేరిన ఆయన కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అన్నాడీఎంకే పార్టీలో అరుళ్మణి క్రియాశీలకంగా  వ్యవహరిస్తూ వచ్చారు. తీరికలేని ప్రచారంలో భాగంగా ఆయన అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు డేనియ‌ల్ బాలాజీ ఇటీవలే చనిపోయిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ లో విషాదం.. డ‌బ్బింగ్ ర‌చ‌యిత శ్రీరామ‌కృష్ణ క‌న్నుమూత‌.. బొంబాయి, జెంటిల్‌ మాన్‌, చంద్ర‌ముఖితో స‌హా 300 చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌కృష్ణ

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)