Tarakaratna Health Update: ఇంకా వెంటిలేటర్ పైనే తారకరత్న, ఎక్మో సపోర్ట్ వార్తల్లో నిజం లేదని తెలిపిన వైద్యులు, ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని వెల్లడి
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు.
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు. ఆయనకు ఇప్పటివరకు ఎక్మో సపోర్ట్ అందించనేలేదని వివరించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)