Director Om Ramesh Krishna: దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యం.. మియాపూర్‌లో నివాసం ఉంటున్న దర్శకుడు, పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యం అయ్యారు.
హైదరాబాద్ మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ(Om Ramesh Krishna) (46) అదృశ్యం అయ్యారు. ఈ నెల 4వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు ఓం రమేష్ కృష్ణ. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. మియాపూర్ పోలీస్ స్టేషన్(Miyapur Police Station) లో ఫిర్యాదు చేశారు భార్య శ్రీదేవి.
మరోవైపు సినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో , ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో సంస్థపై కొనసాగుతున్నాయి ఐటీ రైడ్స్. మూడో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు.. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు, నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు
Telugu film director Om Ramesh Krishna missing