సినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ రైడ్స్(IT Raids) కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో రెండో రోజు సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో , ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో(Mango) సంస్థపై కొనసాగుతున్నాయి ఐటీ రైడ్స్.

ఇప్పటికే ఎస్‌వీసీ(SVC), మైత్రి(Mythri Movies), మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీశారు అధికారులు. పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై అధికారుల ఆరాతీశారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు.

మంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.  'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.  రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా 

IT raids on film celebrities continue for third day

బ్రేకింగ్ న్యూస్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)