Threat To Singer Sunitha Husband: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ సినీ గాయని సునీత భర్త వీరపనేని రామ్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
Hyderabad, April 24: ప్రముఖ సినీ గాయని సునీత (Sunitha) భర్త వీరపనేని రామ్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సునీత, రామ్ (Ram) దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆయనకు కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తాను సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడినని, వ్యక్తిగతంగా కలవాలని భావిస్తున్నట్టు మెసేజ్ లో పేర్కొన్నాడు. అయితే, సదరు వ్యక్తి తనకు తెలియకపోవడంతో రామ్ స్పందించలేదు. ఏదైనా బిజినెస్ విషయం అయితే తన టీమ్ ను కలవాలని రిప్లై ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా కలవాలని ప్రతిరోజు మెసేజ్ లు పెడుతూ లక్ష్మణ్ విసిగించాడు. దీంతో ఆ నెంబర్ ను రామ్ బ్లాక్ చేశారు. దీంతో, మార్చి 28న కొత్త నెంబర్ తో మెసేజ్ లు పంపడం ప్రారంభించాడు. అంతేకాదు బెదిరించడం కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంతో తనకు, తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్ నుంచి ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)