Lew Palter Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ‘టైటానిక్’ నటుడు లేవ్ పాల్టర్ మృతి
'టైటానిక్' నటుడు లేవ్ పాల్టర్(94) కన్నుమూశారు.గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్ మే 21, 2023న 94న లాస్ ఏంజిల్స్ ఇంట్లో మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది.
'టైటానిక్' నటుడు లేవ్ పాల్టర్(94) కన్నుమూశారు.గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్ మే 21, 2023న 94న లాస్ ఏంజిల్స్ ఇంట్లో మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని పాల్టర్ కూతురు కేథరీన్ పాల్టర్ మీడియాతో వెల్లడించింది.జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ మూవీతో పాల్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో డిపార్ట్‌మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్రను పోషించాడు
లేవ్ పాల్టర్ పూర్తి పేరు లియోన్ లూయిస్ పాల్టర్.నవంబర్ 3, 1928న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించాడు. రంగస్థలం నటుడిగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ రంగంలోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ మూవీతో పాల్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో డిపార్ట్‌మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్రను పోషించాడు.పాల్టర్ మరణ వార్త తెలియగానే టైటానిక్ టీమ్‌తో పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)