Prudhvi Raj Health Update: నిలకడగా 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ ఆరోగ్యం, సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న వీడియోని షేర్ చేసిన కమెడియన్

ప్రముఖ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

Prudhvi (File Photo)(Photo Credits: Twitter)

ప్రముఖ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

కూతురి కోసం దర్శకుడిగా మారి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఆయన వీడియో విడుదల చేస్తూ డైరెక్టర్‌గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నాను. కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం

Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement