Producer VA Durai Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, శివపుత్రుడు సినీ నిర్మాత వీఏ దురై కన్నుమూత, గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు..

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు.

VA Durai Dies (Photo-X)

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం శివపుత్రుడు పేరుతో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. హీరో విక్రమ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.

రజనీకాంత్‌,విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. గజేంద్ర చిత్రం తర్వాత దురై సినిమాలకు దూరమయ్యాడు. ఆమధ్య తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఓ వీడియో విడుదల చేయడంతో.. హీరో సూర్య సహాయం చేశాడు.

VA Durai Dies (Photo-X)

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement