Vijay Deverakonda: వీడియో ఇదిగో, విజయ్‌ దేవరకొండ సంచలన నిర్ణయం, తన సంపాదన నుండి 100 కుటుంబాలకు పది రోజుల్లో కోటి రూపాయలు సాయం

మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ.నా ఆనందంలో మీరు ఉన్నారు

Vijay Deverakonda (Photo-Video Grab)

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సక్సెస్ మీట్‌ను వైజాగ్ లో నిర్వహించారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే నేను ఎప్పుడూ పనిచేస్తుంటా. కానీ, ఇప్పుటి నుంచి కొన్ని నిర్ణయాలు మార్చుకుంటున్నా..

మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ.నా ఆనందంలో మీరు ఉన్నారు. అలాంటప్పుడు నా సంపాదనలో కొంత భాగాన్ని మీతో పంచుకోకపోతే వేస్ట్‌.' అని విజయ్‌ పేర్కొన్నారు. త్వరలో తన అభిమానుల కోసం మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలిపాడు.

Vijay Deverakonda (Photo-Video Grab)

Here's Speech Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement