Pallavi Prashanth: వీడియో ఇదిగో, నేను ఎక్కడికీ పోలేదు ఇంటివద్దనే ఉన్నా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిపిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్‌లో లాగిన్ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు.
తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్, పరారీలో బిగ్‌బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
Here's Video