Rathnam Movie Yetuvaipo Song Out: విశాల్ రత్నం మూవీ నుంచి ఎటువైపో సాంగ్ విడుదల, క్యూరియాసిటీ పెంచేస్తున్న మూవీ

రత్నం (Rathnam) టైటిల్‌తో కోలీవుడ్ యాక్టర్ విశాల్ మూవీ వస్తోన్న సంగతి విదితమే. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ లుక్‌లో.. విశాల్‌ లారీలో నుంచి ఆవేశంతో దిగి కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి్ చెండాడుతున్నట్టు కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.

Yetuvaipo fourth Single song from Hero Vishal Rathnam movie releaseed Watch

రత్నం (Rathnam) టైటిల్‌తో కోలీవుడ్ యాక్టర్ విశాల్ మూవీ వస్తోన్న సంగతి విదితమే. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ లుక్‌లో.. విశాల్‌ లారీలో నుంచి ఆవేశంతో దిగి కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి్ చెండాడుతున్నట్టు కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.రాక్‌స్టార్‌ డీఎస్పీ కంపోజిషన్‌లో విడుదల చేసిన రత్నం ఫస్ట్‌ సింగిల్‌ Dont Worry Da Machiతోపాటు మరో రెండు పాటలకు మంచి స్పందన రాగా తాజాగా ఎటువైపో అంటూ సాగే నాలుగో సాంగ్‌ను విడుదల చేశారు.

పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రత్నం డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకోగా.. జీ టీవీ శాటిలైట్‌ రైట్స్‌ మంచి ధరకు దక్కించుకున్నట్టు సమాచారం. భరణి, పూజ సినిమాల తర్వాత హరి-విశాల్‌ కాంబోలో వస్తున్న మూడో సినిమా  ఇది.  ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Hears Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now