#BiggBossTelugu5: బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగో విడుదల, హోస్ట్ ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్, కంటెస్టెంట్లపై ఇంకా అధికారికంగా రాని ప్రకటన

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను (Bigg Boss Telugu 5 First Teaser) నిర్వాహకులు విడుదల చేశారు.

Bigg Boss Telugu 5 First Teaser (photo-Star maa- Twitter)

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను (Bigg Boss Telugu 5 First Teaser) నిర్వాహకులు విడుదల చేశారు. స్టార్ మా చానల్ విడుదల చేసిన ఈ కొత్త లోగో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాగా, బిగ్ బాస్-5 కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటికే అనేక పేర్లు వినిపిస్తున్నా, అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. అటు, హోస్ట్ ఎవరన్న దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. నాగార్జునే ఈసారి కూడా బిగ్ బాస్ షోని నడిపిస్తాడని ప్రచారం జరుగుతుండగా, కొత్త హోస్ట్ గా రానా పేరు కూడా బలంగా వినిపిస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now