IND vs AUS, KL Rahul Sixer Video: ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో KL రాహుల్ బాదిన సిక్సర్ వీడియో చూస్తే షాక్...స్టేడియం అవతల పడిన బాల్..

ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ బాదిన సిక్సర్ స్టేడియం బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

KL Rahul (Photo-Twitter/ICC)

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. పాట్ కమిన్స్ స్థానంలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ పేలుడు సెంచరీలతో జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లకు 399 పరుగులు చేసింది. తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ని కూడా కైవసం చేసుకుంటుంది. శుభమన్ గిల్ 104, శ్రేయాస్ అయ్యర్ 105, కేఎల్ రాహుల్ 52 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 6 సిక్సర్లు కొట్టాడు.  ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ బాదిన సిక్సర్ స్టేడియం బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

KL Rahul (Photo-Twitter/ICC)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement