RBI's Remittance Scheme and TCS: ఎల్ఆర్ ఎస్ కిందకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్.. ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు పంపే వెసులుబాటు.. కేంద్రం నోటిఫికేషన్
ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ తో విదేశీ కరెన్సీతో నిర్వహించే లావాదేవీలను ఆర్బీఐ సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
Newdelhi, May 19: విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు డబ్బులు పంపించే (Money Transfer) వారికి శుభవార్త. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ (International Credit Cards) తో విదేశీ కరెన్సీతో నిర్వహించే లావాదేవీలను ఆర్బీఐ (RBI) సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) (RBI's Remittance Scheme) కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దీంతో ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు నగదును పంపే వెసులుబాటు కలుగనుంది. అలాగే, ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వచ్చే టూర్ ప్యాకేజీలు, ఫండ్స్ కు (విద్య, వైద్యం కాకుండా) టీసీఎస్ (ట్యాక్స్ కల్లెక్టే డ్ ఎట్ సోర్స్) కింద 20 శాతం రుసుము వసూలు చేయనున్నారు. ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)