40 Medical Colleges Lose Recognition: దేశ వ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు, గుర్తింపు కోల్పోనున్న మరో 150 మెడికల్ కాలేజీలు
అరకొర వసతులతో ఆ కాలేజీలు నడుస్తున్నాయని, రూల్స్ విరుద్ధంగా ఆ కాలేజీలు ఉన్నట్లు జాతీయ మెడికల్ కమీషన్ పేరన్కొన్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీలు తమ గుర్తింపును కోల్పోయినట్లు ఎన్ఎంసీ తెలిపింది.
దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల(Medical Colleges) అనుమతి రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అరకొర వసతులతో ఆ కాలేజీలు నడుస్తున్నాయని, రూల్స్ విరుద్ధంగా ఆ కాలేజీలు ఉన్నట్లు జాతీయ మెడికల్ కమీషన్ పేరన్కొన్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీలు తమ గుర్తింపును కోల్పోయినట్లు ఎన్ఎంసీ తెలిపింది.
గుర్తింపు కోల్పోయే మెడికల్ కాలేజీలు ఎక్కువ శాతం గుజరాత్, అస్సాం, పుదుచ్చరి, తమిళనాడు, పంజాబ్, ఏపీ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి.ఇటీవల అండర్‌గ్రాడ్యువేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన తనిఖీల్లో మెడికల్ కాలేజీల గురించి తెలిసింది. గుర్తింపు రద్దు విషయంలో మెడికల్ కాలేజీలు తమకు 30 రోజుల్లోగా అభ్యర్థన చేసుకోవచ్చు అని ఎన్ఎంసీ తెలిపింది. ఒకవేళ ఆ అభ్యర్థనను తిరస్కరిస్తే, వాళ్లు కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించవచ్చు.
NDTV Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)