Lok Sabha Elections 2024: అమిత్ షా హెలికాప్టర్ ప్రమాదం వీడియో ఇదిగో, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కేంద్ర హోం మంత్రి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సోమవారంనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది

Amit Shah Unhurt After Helicopter Carrying Him Briefly Loses Control in Bihar, Video of Home Minister's Narrow Escape Surfaces

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సోమవారంనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు నేలను తాకేలా అటూనిటూ ఊగుతూ కుడి వైపునకు ఒరుగుతూ వెళ్లింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యహరించి హెలికాప్టర్‌ను తన అధీనంలోకి తెచ్చుకుని ముందుకు నడిపించడంతో ప్రమాదం తప్పింది.హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణంపై అధికారులు వెంటనే విచారణ చేపట్టారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now