Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరు జిల్లాలో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు బాధితురాలు
కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు..ధర్నాకు దిగిన యువతీ. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది
కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు..ధర్నాకు దిగిన యువతీ. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె తెలిపిన ప్రకారం బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన మర్రి ప్రణీత, అదే గ్రామానికి చెందిన ఉందుర్తి నవీన్ కుమార్ S/o( ప్రకాష్) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే అతను పెళ్లికి నిరాకరించడంతో ఆమె ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.
మహిళతో అక్రమ సంబంధం.. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు, మెదక్‌లో దారుణ సంఘటన
ఇక మరో ఘటనలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాలో కూలీ పనులు చేసే మహిళతో అన్న చనువుగా ఉన్నాడని తమ్ముడు మద్యం మత్తులో నిద్రిస్తున్న అన్న కుడి చేతి వేలికి, ఎడమ కాలు వేలుకు రెండు విద్యుత్తు తీగలను చుట్టాడు. స్విచ్ వేయడంతో షాక్ కొట్టి శంకర్ గట్టిగా అరవడంతో, తండ్రి నిద్ర లేచాడు.. తండ్రిని చూసిన గోపాల్ అక్కడి నుండి పారిపోగా, శంకర్ అప్పటికే మరణించాడు.
Young Woman Protest Front of Lover House
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)