Indian Army Dog "Zoom" Dies: టెర్రరిస్టులతో పోరాడిన జూమ్ డాగ్ కన్నుమూత, కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ తరపున సేవలు అందించిన జూమ్
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూమ్ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ డాగ్ చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు చేరింది.
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూమ్ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ డాగ్ చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు చేరింది. ఉదయం 11:45 గంటల వరకు వైద్యానికి బాగానే సహకరించిందని, అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసి కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.సైన్యంలో కఠిన శిక్షణ పొందిన ‘జూమ్’.. కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ తరపున సేవలు అందిస్తుంది. అనేక సెర్చ్ ఆపరేషన్‌లలో పాల్గొంది. శత్రువులతో వీరోచితంగా పోరాడి కన్నుమూసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)