Jammu And Kashmir: జమ్మూలో లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి, విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా విరిగిపడిన మంచు పెళ్లలు
విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు.
జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు.ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు.పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)